క్రీడలు

ఎర్రవల్లి లో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

74 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి గ్రామ స్పోర్ట్స్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు.ఈ టోర్నమెంటు గత వారం రోజుల నుండి కొనసాగుతోంది.బుధవారం రోజు వరదరాజ్ పూర్,చేబర్తి జట్లు తలపడ్డాయి.ఇందులో వరదరాజ్ పూర్ 10 ఓవర్ల లో 52 పరుగులు చేయగా, చేబర్తి జట్టు 06 ఓవర్ల లో 53 పరుగులు చేసి విజయం సాధించారు.ఈ సందర్భంగా ఎర్రవల్లి స్పోర్ట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ టోర్నమెంట్ లో ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటుందని,ఈ మ్యాచ్ లో మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గ్యార హర్ష వర్ధన్ కు 03 వికెట్స్ తీయడంతో,మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కప్ చేబర్తి సీనియర్ క్రెకెట్ ప్లేయర్ గ్యార శ్రీశైలం అందజేశారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ కృష్ణ,క్రీడాకారులు రమేష్, కరుణాకర్,శ్రీకాంత్,మహేష్,కార్తీక్,మల్లేష్,వేణు గౌడ్,ప్రవీణ్,బాలరాజు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్