– మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు..
(తిమ్మాపూర్ డిసెంబర్ 14)
అహర్నిశలు కష్టపడి పార్టీకి పేరు తెచ్చేలా పనిచేయాలని మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు కర్ర మణికంఠ, మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహేష్ చంద్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందగా వారిని తననివాసంలో ఘనంగా సన్మానించారు.
కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందంటూ మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటూ యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం మహేష్ చంద్ర జన్మదిన సందర్భంగా ఆయన చేత కేక్ కట్ చేయించారు.
కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, సీనియర్ నాయకులు మాచర్ల అంజయ్య, దావు సంపత్ రెడ్డి, మాచర్ల శ్రీనివాస్, గుంటి మధు, ఎండీ నిస్సార్, సిగిరినేని లక్ష్మణరావు, మాచర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.