.ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19)
సిద్దిపేట జిల్లా,ములుగు మండలం, ములుగులో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయకార్యదర్శి మేడబోయిన మమత, ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ ఆర్ వి యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజుల నుండి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు అని అన్నారు. ఆర్ వి యం లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, హాస్టల్లో నాణ్యతమైన భోజనం పెట్టడం లేదని,
ఎక్కువ సమయం క్లాసులకు కాకుండా హాస్పిటల్ లో పని చేపిస్తున్నారని, పబ్లిక్ సెలవులు పెనాల్టీ పేరుతో డబ్బులు వసులు చేస్తున్నారని పలు డిమాండ్ లను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల డిమాండ్ లను సీఈఓ శ్రీనివాస్ రావ్ తో మాట్లాడగా 10 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇప్పటి నుంచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చూసుకుంటామని వారు తెలిపారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ పది రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు ఆముదలా రంజిత్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కోనేరు ప్రవీణ్, ఆత్తిని హారిక,. తడూరి భరత్ కుమార్, వేముల ప్రవీన్, ప్రణయ్, బండి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.





