ముస్తాబాద్, జూన్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): పేరుకు మేజర్ గ్రామపంచాయతీ అయినా ట్రాక్టర్ టైర్ పాడవడంతో ట్రాక్టర్ ని నిత్యంరద్దీగా ఉండే పాలసేకరణ కేంద్రంవద్ద వదిలేసి వెళ్లిన పారిశుధ్య కార్మికులు. పాలవిక్రయదారులులతో పాటు పై అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. చెత్తాచెదారంతో నిండి ఉన్న ట్రాక్టర్ దుర్వాసన వెదజల్లుతుంది. పాలకోసం వచ్చే గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి చెందిన అధికారులకు సిబ్బందికి సమన్వయలోపం లేకపోవడంతోని ట్రాక్టర్ అక్కడ నిలిచిపోయి ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామపంచాయతీకి శాశ్వత ఈవో సమస్య తలెత్తినట్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపారు. ట్రాక్టర్లో సేకరించిన చెత్తను సైతం వేరే వాహనాల ద్వారా తరలించాలన్న కనీస అవగాహన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
