ప్రాంతీయం

అధికారుల నిర్లక్ష్యంతో గ్రహణంపట్టిన మేజర్ గ్రామపంచాయతీ…

110 Views

ముస్తాబాద్, జూన 17 (24/7న్యూస్ ప్రతినిధి) మూడు నాలుగు రోజుల క్రితం ట్రాక్టర్ టైర్ పాడవడంతో ట్రాక్టర్ ని అక్కడే వదిలేసి వెళ్లిన పారిశుధ్య కార్మికులు. పై అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. చెత్తాచెదారంతో నిండిఉన్న ట్రాక్టర్ నుండి దుర్వాసన వెదజల్లుతుందని. పాలవిక్రయదారులతో పాటు పాలకోసం వచ్చే గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగాఉందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి చెందిన అధికారులకు, సిబ్బందికి సమన్వయం లేకపోవడంతోనే ట్రాక్టర్ అక్కడ నిలిచిపోయి ఉన్నట్లు తెలుస్తుంది. మేజర్ గ్రామపంచాయతీకి శాశ్వత ఈవో లేక పోవడం మూలంగా సమస్య తలెత్తినట్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపారు. ట్రాక్టర్లో సేకరించిన చెత్తను సైతం వేరే వాహనాల ద్వారా తరలించాలన్న కనీస అవగాహన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంమని ప్రజలు మండిపడుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7