{శంకరపట్నం జూన్ 17)
మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి గొర్రె అంజన్ కేరళ రాష్ట్రం లోని నిట్ కాలికట్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు..
పరీక్షలకు ఫీజు కట్టే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను సంప్రదించగా వెంటనే 50 వేలు ఆర్థిక సహాయం అందించి, చదువు పూర్తి అయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు.బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్ధికి సూచించారు…
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణ రెడ్డి , యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, పసుల వెంకటి, కోండల్ రావు , నాయకులు పాల్గొన్నారు.