సిద్దిపేట కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ ని కలిసి (ఎం పీ పీ స్ )పాములపర్తి( హెచ్ డబ్ల్యు ) పాఠశాల కి నూతన భవనం త్వరగా మంజూరు చేయాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
సిద్దిపేట్ జిల్లా, మర్కుక్, మార్చి 24
సిద్దిపేట్ జిల్లా గత సంవత్సరం 01-08-2024 న మార్కుక్ మండల ( ఎం ఈ ఓ ),కి గ్రామస్థులందరు నూతన పాఠశాల భవంతి కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎటువంటి కార్యాచరణ కనబడటం లేదు.దాంతో విద్యార్థులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో చదువు కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని (ఎం పీ పీ స్) పాములపర్తి( హెచ్ డబ్ల్యు ) పాఠశాల కు నూతన భవనం అతి త్వరలో మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
