ప్రాంతీయం

టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్న బిజెపి నాయకులు…

333 Views

ముస్తాబాద్, జూన్ 4 24/7 న్యూస్ ప్రతినిధి) లోకసభ ఎన్నికలు కరీంనగర్ ఎంపీగా రెండోసారి లక్షకు పై చిలుకు మెజారిటీతో గెలుపొందిన బండి సంజయ్ కుమార్ గెలుపు సందర్భంగా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో బిజెపి నాయకులు గ్రామశాఖ ఆధ్వర్యంలో తపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి బాద నరేష్ మాట్లాడుతూ భారత దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అనేకమైన సంక్షేమాలు ప్రవేశపెడుతూ ప్రజల్లో మంచి పేరు పొంది మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా అవుతుండడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found