సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవ్ పూర్ మండల పరిధిలో రైతులకు సరిపడ యూరియా ఎరువులు అందుబాటులో వుంచడం జరిగినదని మండల వ్యవసాయ ఆదికారి యు.వసంతరావు రైతులకు తెలియజేశారు. ఈ రోజు ఆయన జగదేవ పూర్ మండలంలోని అన్ని ఎరువుల దుకాణాలను సందర్శించి ఈ పాస్ మిషన్ మరియు భౌతిక నిల్వలను పరిశీలించారు. మండలంలో ఇప్పటికీ 85 (1890 బస్తాల) మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కావున రైతులు ఎవరు యూరియా దొరకడం లేదని అధైర్య పడవద్దని ఆలాగే వదంతులు నమ్మవద్దని తెలిపారు.కొందరు రైతులు యూరియా దొరకడం లేదని పెద్ద మొత్తంలో కొని బస్తాలు ఇంట్లో నిల్వపెట్టుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ రకంగా ఎవరు కూడా ఇంట్లో నిల్వ చేయవద్దని, రైతులకు సరిపడ ఎరువులు ప్రభుత్వము, వ్యవసాయ శాఖ ద్వారా సరపర చేయడం జరుగుతుంది అని, రైతులు ఎకరాకు సగం బస్తా కాని ఒక బస్తా మాత్రమే యూరియా వాడాలి, అధిక మోతాదులో యూరియా వాడినచో తెగుళ్లు ,పురుగుల ఉదృతి పెరిగి పంట నష్టం జరిగి, దిగుబడి పడిపోతుంది.కావున రైతు సోదరులు మోతాదుకు మించి ఎరువులు వాడరాదు అని అన్నారు.
