ప్రాంతీయం

జీలుగు అందుబాటులో ఉంది

100 Views

జీలుగు అందుబాటులో ఉంది

సిద్దిపేట జిల్లా మే 31

మర్కుక్ మండలం లో, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం గణేష్ పల్లి లో జీలుగు విత్తనాలు రాయితీ పై లభ్యం అవుతున్నాయి అని మండల వ్యవసాయ అధికారి టి.నాగేందర్ రెడ్డి  తెలియజేసారు.

వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జీలుగు వేయడం వల్ల ఎకరానికి 10 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది. 60 కిలోల నతజని, 15 కిలోల భాస్వరం, 50 కిలోల పోటాష్ భూమిలో కలుస్తుంది.

జీలుగు వేసుకోవడం వల్ల

నేల భౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోనికి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.

నేలలో సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెంది , జీవ రసాయనిక చర్యల వలన నేల సారం పెరగడమే కాక, నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుని ఉత్పాదకత సామర్ద్యాన్ని పెంచుకుంటుంది.

భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి.

కలుపు మొక్కలు పెరగకుండా నివారించ వచ్చు.

చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడతాయి అని తెలియజేసారు. ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనం అవసరం అని తెలియజేసారు.

No Slide Found In Slider.

Poll not found