సీతారాం పల్లి గ్రామాన్ని సందర్శించిన బీఎస్పీ నాయకులు
సిద్దిపేట జిల్లా మే 31
సిద్దిపేట రూరల్ మండలం సీతారాం పల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం హనుమాన్ మాల వేసుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన యువకులను గుడిలోకి రావద్దంటూ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తో పాటు మరో ఇద్దరు కలిసి గుడిలోకి రానివ్వకుండా తను వేసుకున్న బట్టలతో గుడికి గేటు కట్టడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన జిల్లా అధ్యక్షుడు కటికల ఓం ప్రకాష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం సభ్య సమాజం తల దించుకోవాల్సిన హేయమైన చర్య అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.కుల అహంకారం తో ఈలాంటి పనులు చేసేన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ సామాజిక సమానత్వం కోసం బాధితుల తరుపున నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు.
అనంతరం సిద్దిపేట ఏసీపి కార్యాలయంలో ఏసీపీ మధు తో కేసు పూర్వపరాలు తెలుసుకొని నిందితులను వెంటనే రిమాండ్ కు తరలించాలని కోరుతూ,అదే విదంగా గ్రామంలో కుల విభేదాలు తొలిగిపోయేలా సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ ప్రజల మధ్య ఐక్యత తీసుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల మల్లేశం ముదిరాజ్, జిల్లా కోశాధికారి జింక సంజీవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండనోళ్ల నరేష్, సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్,గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు కానుగుల రమణాకర్ , సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడు కర్రె హరికిరణ్, జిల్లా ఈసీ మెంబర్ ఖాతా మహేష్, మాజీ అధ్యక్షులు మొండి కర్ణాకర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
