346 Views
ముస్తాబాద్ ఫిబ్రవరి 16 (24/7న్యూస్ ప్రతినిధి ప్రతినిధి): కులసంఘాలు గ్రామాలలో సెటిల్మెంట్ పంచాయతీలు చేయరాదు చేస్తే శిక్షకు అర్హులవుతారని డీఎస్పీ ఉదయ్ రెడ్డి వెల్లడించారు.. ముస్తాబాద్ మండల కేంద్రంలోని యాదవుల కళ్యాణ మండపంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాలు పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఏఒక్క తరహాలోనైన పార్టీల పేరు వాడుకుంటూ పనిపాట లేకుండా ప్రజలను, ఇటు అధికారులను ఇబ్బందిపెడుతూ డబ్బులు రాబట్డానికి బ్లాక్ మేల్ చేస్తూ అపరిచితుల వ్యవహారం తీరుపట్ల ఇబ్బందుల గురిచేస్తుంటె నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి వారిపై తక్షణమే దర్యాప్తు కొనసాగించి తప్పుకు అర్హులైతే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆపై కఠినచర్యలు తప్పవన్నారు. అలాగే సైబర్ నేరాల

పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమవ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్ చేస్తే 24 గంటల్లో రికవరీ చేసే అవకాశం ఉంటుందని డి.ఎస్.పి ఉదయ్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఇంటర్నెట్‌ను పరిమితికిమించి వాడకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఈ మండపంలో కూసున్న పెద్దలకు మేం చెప్పేది ఏంటంటే మనం వాడుకునే ద్విచక్ర వారంతోపాటు హెల్మెట్ తప్పకుండా ఉండాలి ముందుగా ఇంటి యజమానులు హెల్మెట్ ధరించాలి మనలని చూసి మన ఇంట్లోని పిల్లలకు మనమే స్ఫూర్తినివ్వాలి వాళ్లు కూడా హెల్మెట్ ధరించడానికి ఇష్టపడతారన్నారు. అదేవిధంగా మైనర్ బాలలకు వాహనాలు ఇవ్వరాదు వారికి మీరు ఇచ్చినట్లయితే మీరు కూడా చట్టంప్రకారం శిక్షకు అర్హులు అవుతారని అన్నారు. శిరస్త్రాణం విధిగా ధరించాలని హెల్మెట్ ధారణ

వల్ల ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణాలు నిలబడతాయని ఇంటివద్ద కుటుంబ సభ్యులు వారి యొక్కరాకకై ఎదురు చూస్తుంటారని కావున ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధ

నలు అతిక్రమించిన వారికి ప్రభుత్వ నిబంధనలు కనుగుణంగా అపరాధ రుసుము వసూలు చేయబడుతుందని తెలియజేశారు. అలాగే తాళం వేసిన ఇళ్లల్లో తాళాలు పగలకొడుతూ అదును చూసుకొని చోరీలకు ఎగ పడుతున్నారు. ఎన్నో లక్షలుపెట్టి సుందరంగా ఇల్లు నిర్మించుకుంటున్నాం అందులో భాగంగానే కేవలం పదివేలు ఖర్చుపెట్టి సీసీలు అమర్చుకోలేమా దానివల్ల ఇంటి భద్రతతో పాటు దొంగలను అరికట్టవచ్చని తెలిపారు. అదేవిధంగా మన ఇంటిలో ఎదిగిన పిల్లలు ఒకేగదిలో డోర్ చేసుకుని లాప్టాప్ ఉపయోగించకుండా అనవసరమైన ఆలోచనలు పిల్లలకు కలుగకుండా హాల్లోనే ఉపయోగించేలా తల్లిదండ్రులు బాధ్యతలు చేపట్టాలని తమ పిల్లలకు భవిష్యత్ గూర్చీ అవగాహన కలుగ చేయాలని ఇంకా తదితర అంశాలపై పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉదయ్ రెడ్డి, ఎస్సై శేఖర్ రెడ్డి, కుల సంఘాల నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found