ముస్తాబాద్, మే 27 (24/7న్యూస్ ప్రతినిధి): దోస్త్ మీట్ 2024 వాలీబాల్ కబడ్డీ మ్యాచ్ లు ఆటలు రేపటి యువతరానికి నాంది పలకడానికి సరికొత్త మార్గదర్శకాలతో ముందుకు నడుస్తారని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గతంలో మండలం నుండి అద్భుతమైన క్రీడా ప్రతిభతో మండలానికి మంచిపేరు గుర్తింపు తెచ్చారని పలువురు సీనియర్ లు పేర్కొన్నారు. ఆటలు ముగిసిన అనంతరం ఎస్సై కె. శేఖర్ రెడ్డి గెలుపొందిన వారిని అభినందించారు.
