Breaking News ప్రాంతీయం

ముత్యాల తలంబ్రాలను పంపిణి రామకోటి రామరాజు

119 Views

ప్రజ్ఞాపూర్ లోని హనుమాన్ భక్త బృందానికి భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలను సోమవారం పార్తివేశ్వర స్వామి దేవాలయంలో 100మంది భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత తెలియజేసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వతమైనది చివరికి తోడుండేది రామ నామం ఒక్కటే అన్నాడు. భగవన్నామ స్మరణ వల్లనే మనిషికి మనశాంతి కలుగుతుందన్నారు. భగవంతునికి మించిన సేవ మరొక్కటి లేదన్నాడు. ప్రతి ఒక్కరికి భద్రాచల ముత్యాల తలంబ్రాలను అందజేశారు. రామకోటి సంస్థ సేవను గుర్తించి భద్రాచల దేవస్థానం ఇచ్చిన ముత్యాల తలంబ్రాలను లక్షల మంది భక్తులకు అందజేయాలన్నదే సంస్థ లక్ష్యం అన్నారు. రామకోటి రామరాజు నిర్విరామంగా చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకుగాను హనుమాన్ భక్త బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మెతుకు నర్సింలు, నాగపురి రమేష్, కురుమ ఐలయ్య, వడ్డేపల్లి లక్ష్మన్, పుట్ట కనకయ్య, చెక్కెర రమేష్, హనుమాన్ భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found