ప్రాంతీయం

బలిదానాలు వద్దు, పోరాటాల ద్వారాన బీసీ హక్కులు సాధిస్తాం

27 Views

బలిదానాలు వద్దు, పోరాటాల ద్వారాన బీసీ హక్కులు సాధిస్తాం
– సాయి చారి మృతికి తీవ్ర సంతాపం.
– బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ ఒడ్డేపల్లి మనోహర్
– బీసీ విద్యార్థి జేఏసీ నాయకుడు సల్మాన్ ఖాన్, నితీష్.

మంచిర్యాల జిల్లా.

బీసీల హక్కుల కోసం, ప్రభుత్వలు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయాలని, రాజకీయ పార్టీల మోసాలకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సాయి చారి మృతి పట్ల బీసీ విద్యార్థి జేఏసీ, బీసీ జేఏసీ,ప్రకటించింది, మంచిర్యాల జిల్లా పట్టణం లో బీసీ విద్యార్థి జేఏసీ, బీసీ జేఏసీ, ఆధ్వర్యంలో సాయి చారి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ వివేకానంద స్వామి విగ్రహం ఓవర్ బ్రిడ్జి దగ్గర నుండి ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన బీసీ జేఏసీ నాయకులు సాయి మృతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థలలో,విద్యా,ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన బిల్లును ఆమోదించాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు 9 షెడ్యూల్లో పెట్టి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయి కుటుంబాన్ని ఆదుకొని కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అతని కుటుంబంలో భార్యకు ఉద్యోగం కల్పించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, లేనిపక్షంలో బీసీ ల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం గ్రామ గ్రామాన తిరిగి చైతన్యవంతం చేసి మన ఓటు మన బీసీ లకు వేసుకోవాలి, రాబోవు రోజుల్లో బీసీ రాజ్యాధికారానికి తెలంగాణలో పునాదులు వేయడం జరుగుతుందని ఈ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరించడం జరిగింది,

ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా పల్లె భూమేష్,  నిలకటేశ్వర్, తులా మధుసూదన్, వేముల కిరణ్, విద్యార్థి నాయకుడు అఖిల్ బీసీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *