ప్రాంతీయం

వడ్లతో కన్యకా పరమేశ్వరి చిత్రాన్ని రూపోందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

80 Views

కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని అద్దాల మందిరం వద్ద అమ్మ వారి చిత్రాన్ని వడ్లను ఉపయోగించి 2రొజులు శ్రమించి అత్య అద్భుతంగా కన్యకా పరమేశ్వరి చిత్రాన్ని అపురూపంగా రూపొందించి ప్రత్యేక పూజలు జరిపి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవంతుణ్ణి సేవించుకోడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు. నాలో ఉన్న ఆధ్యాత్నిక కలకు పదునుపెట్టి ఆ పరమాత్ముని చిత్రాలు ఎన్నో చిత్రించానన్నాడు. శాశ్వతమైన భగవన్నామాన్ని ప్రతి ఒక్కరు స్మరించాలన్నారు. కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరుంతెలుసుకోవాలన్నారు. వైశ్యుల కుల దైవం కన్యకా పరమేశ్వరి మాత అన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7