Breaking News

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

380 Views

మునస్థాపానికి గురైన యువకుడు పురుల మందు తాగి ఆత్మహత్య..

(తిమ్మాపూర్ మే 17)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘటన..

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువకుడి తండ్రి మాదన మల్లయ్య…

విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ప్రియ సంధ్యారాణి అనే యువతి పెళ్లి చేసుకుంటానంటూ 16 లక్షలతో ఆస్ట్రేలియాకు ఉడాయించిందని పిర్యాదు…

వివరాల్లోకి వెళితే…

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రానికి చెందిన మాధన నాగరాజు అనే యువకుడు గత కొంత కాలంగా ప్రియ సంధ్యరాణి అనే యువతితో వైజాగ్ ఇషా ఫౌండేషన్ లో మాటలు కలిసి ఇద్దరు ప్రేమించుకున్నారు…

కలిసిన 6 నెలల కాలంలోనే పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.

అయితే యువకుడికి తెలియకుండానే అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళడంతో,మనస్థాపo చెందిన యువకుడు పురుగుల మందు సేవించి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు…

న్యాయం చేయాలని పోలిస్ స్టేషన్ లో యువకుడి తండ్రి పిర్యాదు చేశాడు.. యువకుడి తండ్రి మలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చేరాల తెలిపారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్