అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి — బీజేపీ కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి
గజ్వేల్:17 మే 2024
గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డునూ సందర్శించి తూకం వేస్తున్న ట్రాక్లను, రైతులను అడిగి అక్కడి పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తూకంలో అవకతవకలు జరగకుండా అధికారులు చూడాలని కోరారు, అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని పంట నష్టంను అంచనా వేసి తక్షణ సహాయం ప్రభుత్వం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బిజెపి కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు సంగం కరుణాకర్ , అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మర్కంటి ఏగొండ, పాలకొల్లు వెంకటరామిరెడ్డి, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ లంబ నాగరాజు గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు ఆయిల మహేందర్, నాయని సందీప్, మైస విజయ్, సీనియర్ నాయకులు సిల్వేరు జనార్ధన్, నాగు ముదిరాజ్, నరేష్, నరేష్ సేటు కిసాన్ మోర్చ పట్టణ ఉపాధ్యక్షులు పోచమోళ్ల నరసింహులు, ఫోటోల లక్ష్మణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు
