ప్రాంతీయం

రాజీపడితే రాజామార్గం లోక్ అదాలత్ ఎస్సై గణేష్…

153 Views

ముస్తాబాద్, సెప్టెంబర్24 (24/7న్యూస్ ప్రతినిధి): ఈనెల 28వతేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసుకుంటే రాజా మార్గమని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్, గణేష్ వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం నిర్వహించే లోక్ అదాలత్ తో సులభంగా మనస్పర్ధలు తొలగించుకుని ఆప్యాయగా పలకరించుకొని లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసి పనిభారం తగ్గించుకోవాలన్నారు. రాజీ పడదగిన క్రిమినల్‌, సివిల్‌, పలు కేసులను జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించి, ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ అయితే ఇరు పక్షాలకూ గెలుపే ఉంటుందని పేర్కొన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడానికి ఇదో మార్గమన్నారు.

No Slide Found In Slider.

Poll not found