ప్రాంతీయం

క్రైస్తవులు బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలి

45 Views
  • తెలంగాణ క్రైస్తవ సమాజం మొత్తం సెక్యులర్ పార్టీ ఐన బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని తెలంగాణ గాడ్ విజన్ అసోసియేషన్ అధ్యక్షులు నెలమళ్లి సికిందర్ విజ్ఞప్తి చేసారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం నందు జరిగిన పాస్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలుగా శాంతిగా, సంతోషంగా, సురక్షితముగా, ఉన్నారని ఆయన అన్నారు. అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వము అని అయన అన్నారు. అందుకే తెలంగాణ క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవులు అందరూ బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వెంకట్రామిరెడ్డి తన స్వంత డబ్బుతో ట్రస్ట్ ఎరాటు చేసి విద్యార్థులకు, పెద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజా జీవితంలోకి వచ్చారని ఆయన అన్నారు. వెంకట్రామిరెడ్డి గెలిపించుకోవని అయన కోరారు. ఈ సమావశంలో పాస్టర్లు రాంబాబు, సామెల్, సాగర్, నాగరాజు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka