ప్రాంతీయం

మంచిర్యాలలో మాన్యశ్రీ కాన్సీరామ్ 92వ జయంతి వేడుకలు

35 Views

మంచిర్యాలలో మాన్యశ్రీ కాన్సీరామ్ 92వ జయంతి వేడుకలు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కాన్సిరాం  92 జయంతి వేడుకను కాన్సీరామ్  చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ప్రధాన కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి కోసంపోరాటం చేసిన అంబేద్కర్ వారసుడే కాన్సిరాం అని కాన్సీరామ్  అడుగుజాడల్లో నడిచే ప్రస్తుత నాయకుడు వారి ఆశయాలను కొనసాగించే ఏకైక నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అని విశారదన్ మహారాజు ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని బహుజన రాజ్యం విశారదన్ తోనే సాధ్యం అవుతుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బిసి జిల్లా నాయకులు మంచర్ల సదానందం, బీసీ నాయకులు చింటూ, వేణు, నాయకులు ప్రేమ్ రావు, నారాయణ, సుధాకర్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు నందిపాటి రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *