నీలం మధు గెలుపు ఖాయం.
సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కనకమైన శ్రీకాంత్ ముదిరాజ్.
గజ్వేల్ మే 11
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు భారీ మెజార్టీతో గెలుపొందుతాడని సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఓరగబెట్టిందిలేదన్నారు. నాయకులు మాత్రమే లబ్ధి పొందారని సామాన్య ప్రజలు పొందలేదని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ లక్ష మెజార్టీతో గెలుపొందుతాడని వారు ధీమా వ్యక్తం చేశారు.





