ప్రాంతీయం

రాజ్యాధికార సాధనె అంబేద్కర్ కు నిజమైన నివాళి

54 Views

రాజ్యాధికార సాధనె అంబేద్కర్ కు నిజమైన నివాళి

తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు మైస రాములు

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్

గజ్వేల్, తెలుగు న్యూస్ 24/7 డిసెంబర్ 6

గజ్వేల్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి పురస్కరించుకొని స్థానిక గజ్వేల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యులు మైస రాములు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్. డి బిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి. మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి. మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నత వర్గాలకు భూస్వాములకు విద్యావంతులకు మాత్రమే వర్తింపజేసే ఓటు హక్కును సమాజంలో ఉన్న చిట్టచివరి పేదవాడికి సైతం ఉండాలని ఓటు హక్కు సాధించిపెట్టిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వేషన్ల ద్వారా రాజకీయ పదవులు అనుభవిస్తున్న దళిత బహుజనులందరూ అంబేద్కర్  రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మత గ్రంథాలను చదివి పాటించడం ద్వారా స్వర్గం నరకం వస్తుందో లేదో ఎవరికి తెలియదు కానీ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆచరిస్తే మన తలరాతను మనమే మార్చుకోవడం కాకుండా దేశం యొక్క రోగతిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ దిశలో దళిత బహుజన యువకులందరూ రాజ్యాధికార సాధన దిశగా పయనిస్తూ రాజ్యాధికారాన్ని సాధించిన రోజే అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అట్టకూరి రాములు మైసూర్ సామి సంగపురం నర్సింలు మన్నె కృష్ణ కిష్టయ్య నాగరాజు కిష్టపురం యాదయ్య ప్రజా సంఘాలు దళిత సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *