ముస్తాబాద్, మే 11 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీలో అసలు ఏం జరుగుతుంది గత రెండు నెలలక్రితం ఓ అధికారికి మూడు పదవులు ఏలుతూ నేనేరాజు నేనేమంత్రిగా వ్యవహరిస్తూ నేనేంచేసినా నేనన్నదేవేదం నేనన్నదే వ్యవహారం అన్నట్లుగా వ్వవహరిస్తున్న ఆ అధికారిపై ప్రజా ప్రతినిధులు పైఅధికారులకు అనేక ఆరోపణ తెలియపరిచిన నిమ్మకు నీరెత్తనట్లు
ఉందంటున్నారు.. దీనిపై పై అధికారుల దృష్టికి పోయిన పట్టనట్లు వ్యవహరించడంలో ఆంతర్యమేంటో వేచిచూడాల్సిందేనా… చట్టాన్ని తమకు అనుగుణంగా చుట్టంలా మలుకొని వ్యవహరిస్తున్న తీరును చూస్తే పై అధికారుల హస్తం ఉందన్నట్లేనా?. పలువురు భావిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట లేదా?. మండల స్థాయి అధికారుల అండదండలతో కిందిస్థాయి ఫోర్త్ క్లాస్ ఉద్యోగి ఇంటిపన్నుల రసీదులపై అవుకతకలు జరిగిన ఇతర పత్రికలలో ప్రచురితమైన మూడునుంచి రెండు పదవులున్న అధికారి ఫోర్త్ క్లాస్ ఉద్యోగిని కాపాడoటంలో తెగఆరాటపడుతూ ఉండడంలో ఆంతర్యం ఏమిటనని కొందరు రాజకీయ నాయకులకు అనేక అనుమానాలకు దారితీస్తుందని ఆరోపిస్తున్నారు. ఒకబిల్లు కలెక్టర్ ఇంటిపన్ను రషీద్ బిల్లులపై అవుకతౌకలే కాకుండా క్యారెక్టర్ సర్టిఫికెట్ ముద్ర తయారు చేయించుకుని గుట్టుచప్పుడు కాకుండా సర్టిఫికెట్ ఇస్తూ సొమ్ముచేసుకుంటూ బయటపడిన ఆ అధికారిపై పైఅధికారులు చర్యలు తీసుకోకపోవడంమే కాకుండా సేఫ్ సైడ్ లో ఉంచడం అనేకమైన అనుమానాలకు దారితీస్తుందని పలువురు ప్రజా ప్రతినిధులు ముక్కుమీద వేలేసుకున్నారు. ఫోర్త్ క్లాస్ ఉద్యోగికి క్యారెక్టర్ సర్టిఫికెట్ జారీచేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నగానే మిగిలిపోయింది. గత ఆరుసంవత్సరాల నుండి సదరు ఉద్యోగి ఓవైపు ప్రభుత్వ వేతనం పుచ్చుకుంటూ క్యారెక్టర్ సర్టిఫికెట్ తో పాటు ఇంటిపన్ను రసీదు బిల్లులపై లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూఉన్న పై అధికారుల చర్యలు శూన్యం.. పైధికారులు ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ అధికారులపై చర్య తీసుకోకపోవడంపట్ల ఆంతర్యం ఏంటోనని పలువురు నిస్సహనానికి గురయ్యారు. మేజర్ గ్రామపంచాయతీలో ఇవే కాకుండా అనేకమైన అక్రమాలు జరుగుతున్న మండలంలో కోడైకూసిన అధికారులపై పైఅధికారులు చర్యలు తీసుకోకపోవడంపట్ల మాజీ సర్పంచులు వార్డుసభ్యులతో పాటు పలు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. అనేక లోపాలడొంక కదిలించడానికి మేజర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అవినీతి అక్రమణలపై జిల్లాస్థాయి ప్రభుత్వ అధికారులకు సీనియర్ రాజకీయ నాయకుల హస్తంతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అనేకమై ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతి అధికారులపై చర్యలు తీసుకొనడంపట్ల జంకుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అవినీతి అధికారిని కాపాడడంలో పై స్థాయి అధికారుల ధీమా ఉన్నానాంన్లు ప్రతి అధికారి అవినీతి మార్గాన్నే ఎంచుకుంటూనే వెళ్తాడు.. ప్రభుత్వాలు మారిన మండలస్థాయి అధికారుల నుండి జిల్లాస్థాయి అధికారులు చూసిచూడనట్లు వదిలేయడం వెనుక ఏముందోనంటున్న ప్రజా ప్రతినిధులు ప్రజలు… ఇక ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ చిక్కుముడి విప్పడంలో కాలయాపన చేస్తూ మరుగున పడేసి అవకాశం ఉందా వేచిచూడాల్సిందేనంటున్న పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.




