ప్రాంతీయం

ఎన్నికలు సజావుగా జరిగేలా వ్యవహరించాలి

99 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భాద్యతగా వ్యవహారించాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్*

*పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి*

రామగుండం పోలీస్ కమీషనర్  శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి)  పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ సందర్బంగా EVM ల తరలింపు, పోలింగ్ కేంద్రాల వద్ద మరియు తిరిగి EVM లు స్ట్రాంగ్ రూమ్ కి చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో మంచిర్యాల M కన్వెన్షన్ హాలు నందు ఇట్టి సమావేశాన్ని నిర్వహించారు. రూట్ మొబైల్స్ ఇంచార్జి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యంగా అధికారులు సిబ్బంది ఎన్నికల విధుల నిర్వహించాలని సీపీ గారు సూచించారు. ఎన్నికల నిర్వహణ పట్ల, చేయవలసిన విధుల పట్ల, మొబైల్ పార్టీల నందు, పోలింగ్ సమయం పట్ల వివిధ అంశాలతో కూడిన పూర్తి అవగాహనను సిబ్బందికి అందించడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమి కూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. ప్రతి ఒక్క సిబ్బంది వద్ద తాము నిర్వహించే పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చే ఉన్నతాధికారుల మొబైల్ నెంబర్లను ముందుగానే తీసుకోవాలని సూచించారు. రూట్ మొబైల్స్ నందు సిబ్బంది రిసెప్షన్ సెంటర్ కు వచ్చేంతవరకు అప్రమత్తంగా ఉంటూ తమ విధులను పూర్తిగా నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఉందని సమాచారం వచ్చిన వెంటనే దగ్గర లో ఉన్న రూట్ మొబైల్ సిబ్బంది స్పందించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలి.ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మన వంతు కృషి చేయాలని తెలియజేశారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకొని ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, లక్షేత్తిపేట్ సీఐ నరేందర్,ఎస్సైలతో పాటు రూట్ మొబైల్స్ ఇంచార్జ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్