ప్రాంతీయం

అనంతరావుపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం

63 Views

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామం లో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంజీ డాక్టర్ రాజిరెడ్డి ,గోపాలమిత్ర , గౌరీ శంకర్ మాట్లాడుతూ పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు వైద్యం అందజేయడం జరుగుతుందని పాడి రైతులు, జబ్బు చేసిన పశువులను పశువుల డాక్టర్లకు చూపించాలని కోరారు,ఉచిత పశు వైద్య శిబిరం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో డాక్టర్ నిహాల్ రెడ్డి సింగాటం పశు వైద్యశాల డాక్టర్, వి.ఏ. కిరణ్, వి.ఏ. మహేందర్, గోపాలమిత్ర సూపర్వైజర్,భాస్కర్ గౌడ్, ఓఎస్ శంకర్, మహేందర్, యాదగిరి, మల్లేష్, పాడి రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్