ప్రాంతీయం

ఈ నెల 6, 7 తేదీలలో సి.ఎం. కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు,జిల్లా యువజన క్రీడా సేవల అధికారి గుర్రాల హనుమంత రెడ్డి

17 Views

ఈ నెల 6, 7 తేదీలలో సి.ఎం. కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు,జిల్లా యువజన క్రీడా సేవల అధికారి గుర్రాల హనుమంత రెడ్డి

మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 5, 2026:
సి.ఎం. కప్ – 2025 పోటీలలో భాగంగా ఈ నెల 6, 7 తేదీలలో జిల్లాలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడా సేవల అధికారి గుర్రాల హనుమంత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో మినీ క్రీడా మైదానం, బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రధానమంత్రి శ్రీ టి.జి.ఆర్.జె.సి.- తాళ్లగురజాల లో ఈ నెల 6వ తేదీన, మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈ నెల 7వ తేదీన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్ బాల్, యోగా, చెస్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, కరాటే ఆటలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, మండల స్థాయిలో ఎంపిక కాబడిన క్రీడాకారులు తమ నమోదు స్లిప్, నిజ ఆధార్ కార్డుతో సకాలంలో హాజరుకావాలని, ఆలస్యంగా వచ్చిన క్రీడాకారులకు అనుమతి ఉండదని తెలిపారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *