ముస్తాబాద్, మే 6 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి సిరిసిల్ల కాంసెన్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్ గతపది యేండ్ల కాలంలో బిఆర్ఎస్ దోపిడికి వెన్నుతన్నుగా ఉన్న బిజెపినీ ఉనికి లేకుండా పారదోలాలన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానిస్తూ విభజన చట్టంలో ఉన్నహామీలు గతపదివేలలో ఏఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేసిన బిజెపికి ఈసారి బుద్ధి చెప్పాలన్నారు. బిజెపితో కుమ్మక్కై ఎలాగైనా బిజెపిని గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారమే చేయకుండా ఇంట్లో ఉంటున్నారన్నారు. విద్యావంతుడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం తనసొంత మేనిఫెస్టోను రూపొందించి విద్యార్థులకు ప్రజలకు మంచిచేస్తా అంటున్న మన వెలిచాల రాజేందర్ రావు ని గెలిపించాలని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరడం తద్యంమని భాను పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ ప్రశాంత్, విజయ్, మధు నర్సయ్య, మండల కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
