అనారోగ్యంతో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహయం అందించిన తోటి హోమ్ గార్డ్స్.ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచిన హోమ్ గార్డ్స్ ని అభినదించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
జిల్లా లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన ఎస్.కె.సుబాని కుటుంబ సభ్యులకు చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ గారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన హోమ్ గార్డ్ ఎస్.కె. సుబాని కుటుంబానికి తోటి హోంగార్డ్ లు బాసటగా నిలిచి స్వచ్ఛందంగా తమ ఒక రోజు వేతనం 1,48,000/- రూపాయలు వారి కుటుంబా సభ్యులకు ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది.పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు…ఈ కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి, హోమ్ గార్డ్ ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ రవిందర్, దేవరాజ్,రవీందర్,పౌర్ణమి ఇక్బల్ ,సుబాని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





