ప్రాంతీయం

చేర్యాల మున్సిపాలిటీ పోలింగ్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి…

17 Views

చేర్యాల మున్సిపాలిటీ పోలింగ్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి…..

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7 

చేర్యాలమున్సిపాలిటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – పెద్దమ్మగడ్డ, పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల,జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల(కో ఎడ్యుకేషన్) లోని పోలింగ్ స్టేషన్ లలో ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ..జిల్లాలో దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలలో 72 వార్డులలో 176 పోలింగ్ కేంద్రం లలో ఓటింగ్ సరళి సజావుగా జరుగుతుందని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.అక్కడక్కడ వైద్య శిబిరం, బిఎల్ఓ స్లిప్ పంపిణీ పోలింగ్ కేంద్రం లోపల ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే కేంద్రం బయటకు మార్చాలని అధికారులను ఆదేశించారు.పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందజేయడంలో లోటు పాట్లు జరగకుండా నిన్నటి రోజు అక్కడక్కడ జరిగిన భోజన లోపాలు జరగకుండా చూసుకోవాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.పోలింగ్ కేంద్రంలో 100 మీటర్ల వరకు వాహనాలను అనుమతి లేదనివృద్ధులనువికలాంగులను వీల్ చైర్ ద్వారా లోపలికి తీసుకురావాలని, ఫోన్ ఎవ్వరిని అనుమతి లేదని పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలిస్ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంటఏసిపివెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, తహసిల్దార్ దిలీప్ కుమార్, తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *