మంచిర్యాల జిల్లా.
వక్ఫ్ సవరణ చట్టం పై తప్పుడు ప్రచారం, పేద ముస్లిం కు న్యాయం చేయడానికే వక్ఫ్ సవరణ చట్టం – రఘునాథ్ వెరబెల్లి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ పై కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింలకు దక్కాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకవస్తే దాని పై కాంగ్రెస్ ఎంఐఎం మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ స్వలాభం కోసం బిల్లు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇన్ని రోజులు వక్ఫ్ ఆస్తుల పేరుతో కొన్ని సంపన్న ముస్లిం పెద్దలు అవినీతికి పాల్పడి ఆస్తులను దోచుకున్నారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులు ముస్లిం లో పేదలకు మరియు వెనుకబడిన ముస్లింలకు కూడా ఈ ఆస్తులు చెందాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆమోదం పొందేందుకు కృషి చేశారని తెలిపారు. కానీ కొన్ని మతతత్వ పార్టీలు ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం వక్ఫ్ పై ముస్లిం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలు ఎవరు కూడా వక్ఫ్ పై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వక్ఫ్ ఆస్తులు అందరికీ అందుబాటులో ఉండేలా మోదీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టి వెంకట కృష్ణ, కొయ్యల ఎమాజీ, గాజుల ముఖేష్ గౌడ్, తాజ్ ఖాన్, ఎనగందుల కృష్ణ మూర్తి, అమిరిశెట్టి రాజు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, మాసు రజిని, అక్కల రమేష్, రాకేష్ రెన్వ, బూర్ల చిరంజీవి మరియు తదితరులు పాల్గొన్నారు.





