చేబర్తి లో జోరుగా బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం
నవంబర్ 15
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో దుర్గామాతకు పూజలు నిర్వహించుకొని బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ అశోక్, వంటి మామిడి మార్కేట్ కమిటీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ విజయం ఖాయం అని ఏ ఇంటికి వెళ్లిన కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని గత ప్రభుత్వాల హాయం లో నీటి గోస,కరంటు గోస ఉండేదని రైతు బాందవుడు సీఎం కెసిఆర్ దూర దృష్టి తో కరెంటు గోస,నీటి గోస తీర్చిన మహానుభావుడు అని కారు గుర్తుకు మేమంతా ఓటు వేస్తామని ప్రతి ఒక్కరూ హామీ ఇస్తున్నారని అన్నారు,
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి, వార్డ్ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గ్యార మల్లేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాములు గౌడ్, రైతుబంధు గ్రామ కమిటీ అధ్యక్షులు జాలని బాల నరసయ్య యూత్ అధ్యక్షులు కొంతం గణేష్, బబ్బురు నర్సింలు, జయరామ్, శెమ్మని భాస్కర్,బలరాం,రాజు, తదితరులు పాల్గొన్నారు





