మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నూతన ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – “ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమీపంలోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యం. కొత్త ఆసుపత్రి ప్రారంభంతో భీమారం మండల ప్రజలకు తక్షణ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి” అని తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





