ప్రాంతీయం

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఐటీ మంత్రి

118 Views

పెద్దపల్లి పట్టణంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గడ్డం వంశీ కృష్ణ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన  ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రివర్యులు శ్రీ. దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.

పెద్దపల్లి పట్టణంలోని బంధంపల్లి లో మరియు చీకురాయి జంక్షన్ లో శుక్రవారం రోజున సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని బలపరుస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లను ఏర్పాటు చేసి మే 13 వ తేదీన జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన గౌరవ పెద్దపల్లి పార్లమెంటు ఇంచార్జీ మంత్రివర్యులు  దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు.

ఈ కార్నర్ మీటింగ్ రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ మాక్కన్ సింగ్ పెద్దపల్లి అసెంబ్లీ ఇంచార్జీ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ ఉన్నారు.

తదుపరి ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఓదెల మండల బీ.ఆర్.ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు బొగే సురేష్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు సొగల రమేష్, అబ్బిడిపల్లె గ్రామ కో ఆప్షన్ సభ్యులు మల్లెవేణి స్వరూప, నాగుల మల్యాల బ్రాహ్మయ్య, కనకయ్య, కుమార్, సదయ్య, కొమురయ్య రవి సంపత్  రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మరియు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్