ప్రాంతీయం

ఎంపీగా వినోద్ కుమార్ నే గెలిపించుకోవాలి…

181 Views

ముస్తాబాద్, మే1 (24/7న్యూస్ ప్రతినిధి): లోకసభ ఎన్నికల ప్రచారం సరళి మారింది ఎండలు మండుతుండడంతో  ఇంటింటికి తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువమంది ఓటర్లు ఉన్న ప్రాంతాలకువెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నేడు ఉపాధి కూలీలకు వివరిస్తూ వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలని మద్దతు కూడగడుతున్నారు. ఎండ తీవ్రత ఉండడంతో ఉపాధి కూలీలు ఉదయం 9.గంటల వరకే కూలీలంతా తమ పనులకు వెళ్తున్నారు. పూడిక తీత తమ మట్టి పనులు నిర్వహిస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు ఉపాధిపని జరుగుతున్న ప్రాంతాలనే ప్రచార అడ్డాలుగా మలుచుకొని కూలీలు తమ పనులు ముగించుకుని వెను తిరుగు క్రమంలో వారితో సంభాషణచేసి లోకసభ ఎన్నికల దృష్టియా ఎంపీసీట్లు గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, శీలంస్వామి, నల్ల నరసయ్య, పల్లె సత్యంగౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్