ప్రాంతీయం

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

133 Views

దౌల్తాబాద్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ దార సత్యనారాయణ, దళిత సంఘం నాయకుడు సంభాగ యాదగిరి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్లేశం పల్లి, ఇందుప్రియల్ గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాతగా అంబేద్కర్ నిలిచిపోయారని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భీంరాజు, కుమార్, నరేష్, శౌరి రెడ్డి, గౌస్, స్వామి, రాములు, బిక్షపతి, సాహెబ్, యాదగిరి, మల్లేశం, ముత్యాల గౌడ్, కిష్టయ్య, కుమార్, అరుణ్ ,సత్తయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *