కేజీబీవీ ఉపాధ్యాయునిల సమస్యల పరిష్కారం కోసం టిపిటిఎఫ్ రాష్ట్ర వ్యాప్త మూడు దశల పోరాటంలో భాగంగా కెజిబివి రాయపోల్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కెజిబివిల ఎదుట నిరసన ప్రదర్శనను నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులు సుంచు నరేందర్ మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న కెజిబివి ఉపాధ్యాయినిలను రెగ్యులర్ చేస్తూ ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వీస్ నిబంధనలు, సెలవు నిబంధనలు రూపొందించి అమలు చేయాలని, అందరి ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు జారిచేయలని, ఉపాధ్యాయినిలను రాత్రి విధుల నుండి తొలిగించి వారి స్థానంలో మాట్రిన్లను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు శేషాచారి, మండల టిపిటిఎఫ్ నాయకులు స్వామి, వెంకట్, వరప్రసాద్, శ్రీనివాస్ ,వేణు, నాగస్వామి మరియు కెజిబివి ఉపాధ్యాయినిలు తదితరులు పాల్గొన్నారు.