ముద్ద చర్మ వ్యాధి నివారణకు పశువులకు టీకాలు…
ఎల్లారెడ్డిపేట నవంబర్ 16
ముద్ద చర్మవ్యాధి నివారణ కోసం ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలలో 18 గ్రామాలలో సుమారు 8వేల పశువులకు టీకా వేసినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ రేణుక తెలిపారు ,
ముద్ద చర్మ
వ్యాధి నివారణ కోసం రైతుల కు మండలాల వారిగా అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలంగాణ ప్రభుత్వం తరఫున పశువైద్య పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమే తెలిపారు,
ఈ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మ క్రిమి అయిన వైరస్ వలన సోకుతుందని దోమలు , ఈగలు, గోమార్లు ,
పిడుదులు , వంటి కీటాకాల వలన వ్యాప్తి చెందుతుందని గోజాతిలో ఎక్కువగా సోకుతుందని గేదె జాతిలో కూడా వచ్చే అవకాశం ఉంది మిగతా జీవాల్లో ఈ వ్యాధి సంభవించదన్నారు
ఈ వ్యాధి మనుషులకు సోకదని ఆమె తెలిపారు,
రెండు మూడు రోజులు పసుపుకు జ్వరం వస్తుందని శరీరంపై రెండు- ఐదు సెంటీమీటర్ల గుండ్రంగా దద్దులు కురుపులు వస్తాయని ఆకలి మందగిస్తుందని గంగడోలు కాళ్ళకు వాపు రావచ్చునని పాల ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుందని చూడి పశువుల్లో అబార్షన్ మగ పశువుల్లో వ్యంధత్వం సంభవించవచ్చునని ఆమె తెలిపారు
వ్యాధి సోకిన పశువును వెంటనే మంద నుండి వేరుచేసి తక్షణ చికిత్స అందించాలని బయోటికలు పారాసిటమాల్ యాంటీ సేఫ్టీ ఆయింట్మెంట్లతో చికిత్స అందించాలని కొత్త పశువులను 15 రోజుల వారంటైన్ చేసిన తర్వాతనే మందలో చేర్చుకోవాలని వ్యాధి సోకకుండా పశువులకు బోట్ పార్క్ టీకాలు వేయించాలని గోమార్లు పిడుదులు నివారణకి పాకలో క్రిమిసంహారిక ముందు చల్లాలని కొట్టములను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కీటకాలు పెరగకుండా పొగ వేయాలని రేణుక వివరించారు
ఈ టీకా కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు పందిళ్ళ నాగరాణి టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సల్మాన్, వైద్య సిబ్బంది లక్ష్మి సుజాత , గణపతి ,సుజాత ,చిన్నో జీ తదితరులు పాల్గొన్నారు ,




