ప్రాంతీయం

అలసిన మనసులకు అండగా హస్తం

89 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి)ఏప్రిల్ 02

 

*_పెద్దఎత్తున కారు దిగి హస్తం పార్టీలో చేరిన మాజి మంత్రి ఎర్రబెల్లి ప్రధాన అనుచరులు.. అయో మయంలో ఎర్రబెల్లి.. అందరి చూపు యశస్విని ఝాన్షమ్మ వైపు*

 

*_ఝాన్షమ్మ నాయకత్వం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలన భేష్ అంటు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు వేయి మంది  గాంధీ భవన్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేరిక.._*

 

*_పాలకుర్తి నియోజకవర్గం లో కారు పార్టీని ఖాళీ చేసి దిశగా పావులు కదుపుతున్న ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి.._*

 

_మంగళవారం రోజు గాంధీభవనకు చేరుకున్న పాలకుర్తి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ మాజి సర్పంచ్ లు,ఎంపీటీసీ ల, వివిధ హోదాల్లో ఉన్న చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు వేయి మంది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి l ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి  మాట్లాడుతూ డోర్ లు తెరుస్తాం పాలకుర్తి బిఆర్ఎస్ ను ఖాళీ చేస్తాం ఊరూర చేరికలు కాంగ్రెస్ కండువాలు కప్పే పండుగ చేస్తాం ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి.

పాతవాళ్ళు ఎవరూ.. అనవసరంగా పరేషాన్ కాకండి.. మీరు పడిన కష్టం మాకు తెలుసు.. మీ వెంట మేము ఉంటాము పార్టీకోసం కష్టపడండి ఎంపి ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో 1లక్ష మెజారిటీ అందించాలి ఝాన్సి రాజేందర్ రెడ్డి.

  1. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్