ముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) లోక్‌సభ ఎన్నికల కోడ్ దృష్ట్యా బీఆర్‌ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని ఈ మేరకు ఆపార్టీ కార్యనిర్వాహన అధ్యక్షుడు పిలుపుమేరకు మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి అనంతరం బిఆర్ఎస్ ఆఫీస్ వద్ద పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలతో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను కార్యాలయంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, అక్కరాజు శ్రీనివాస్, గాండ్ల సుమతి, శీలం స్వామి, చారి, కంచం నర్సింలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
