కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం -మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి
గజ్వేల్ మే 11
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం అని మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి అన్నారు. మార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపుకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కరపత్రాలు పంచుతూ గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ నుండి ఎంపీ స్థానానికి ఎదిగిన వ్యక్తి కే గ్రామ ప్రజల సమస్యలు గ్రామంలో ఉండే ప్రజల బాధలు తెలుస్తాయని అన్నారు. గత 70 సంవత్సరాల లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం, గ్రామంలో పాఠశాల, రైతులకు పంట రుణమాఫీ పథకం, పెన్షన్లు ఇలాంటి సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు ఇప్పటికీ మన కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రజలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ను గెలిపించాలని మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి గ్రామస్తులతో అన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్, అనిల్, రమేష్, స్వామి, మణికంఠ, స్వామి, రాజు, భాస్కర్, అరుణ్, వంశీ తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





