గంభీరావుపేట మండలంలో కొందరు వ్యక్తులు న్యూసెన్స్ చేసినందున కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మండల కేంద్రంతో పాటు దమ్మనపేట గ్రామంలో డిజె సౌండ్ తో స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా న్యూసెన్స్ చేశారు. అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించి పది మందితో పాటు మరో కొంతమంది పైన కేసు నమోదు చేశామని తెలిపారు.




