సెప్టెంబర్ 10:
రాష్ట్రంలో డా: బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్.
నిన్న నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి, విజయవాడ సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుండగా, ఆయన్ని కలిసేందుకు బయలుదేరిన రాజేంద్రప్రసాద్ని ఇతర నాయకులను అడ్డగించిన ఉయ్యూరు టౌన్ ఎస్సై మరియు ఆయన సిబ్బంది.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నర సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడుని, లోకేష్ బాబు ని ఏ కేసులో ఇరికిద్దామని అనేక కుట్రలు పన్నుతుందని, మా నాయకుని 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మచ్చలేని చంద్రుడని, అలాంటి ఆయనపై స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలు జరిగాయి అంటూ, అక్రమ కేసు బనాయించారని, గత రెండు సంవత్సరాల క్రితమే హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాదోపవాదాలు ముగిశాయని, అప్పుడు లేని చంద్రబాబు నాయుడి పేరు ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చిందని, కేవలం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న మద్దతు చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని, మీ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు.
గత మూడు రోజులుగా తీవ్రమైన వైరల్ ఫీవర్ లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడి దగ్గరకు బయలుదేరిన రాజేంద్రప్రసాద్.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిమి భాస్కర్, బూరెల నరేష్, నడిమింటి పైడయ్య , పడమట వెంకటేశ్వరరావు, టీఎన్ఎస్ఎఫ్ జంపాన తేజ,తాడిపర్తి పవన్, లంకె అప్పలనాయుడు, షఫీ, సాయి తదితరులు పాల్గొన్నారు.