మంచిర్యాల జిల్లా.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల సంబరాలు.
టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు.
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా సందర్భంగా.
రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ఈరోజు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ సీతక్క చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
అనంతరం మిఠాయిలు పంచి, టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..





