మూస్తాబాద్, ఏప్రిల్ 23 (24/7న్యూస్ ప్రతినిధి):మేజర్ గ్రామ పంచాయతీలో బిల్లులో చేతివాటం బిల్లులో గొల్ మాల్ జరిగిన వార్తా పలు పత్రికలలో ప్రచురితమైనా, దానిపై పై అధికారులు ఇంతవరకు స్పందించకపోవడంతో అసలు చర్యలు ఉన్నట్లా లేనట్టాని స్థానిక ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ కంచంమంజుల నర్సింలు, మండల కో ఆప్షన్స్ సభ్యులు, మాజీ వార్డ్ సభ్యులు మండిపడ్డారు. వారు ప్రశ్నిస్తూ గత ఆరునెలల క్రితం ఇదే బిళ్ళుల వ్యవహారంపై తార్మారైన విషయం నాదృష్టికి వస్తే దానిమీద ఎలాంటి స్పందన లేకుండా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. అదేవిధంగా ఇంటి పర్మిషన్లపై అక్రమ వసూళ్లుచేస్తూ కార్యదర్శి నిర్వహించే విధినిర్వహణను అంతాతానే చూసుకుంటానని పలు సర్టిఫికెట్లపై ముద్రలేసి సంతకాలు చేస్తూ సొమ్ముచేసుకుంటూ దొరికిపోయిన బిల్ కలెక్టర్ అధికారిపై పైఅధికారులు పైకిపొక్కకుండా కప్పిబుచ్చారన్నారు. అది మరవక ముందే మళ్లీమేజర్ గ్రామపంచాయతీలో క్యారెక్టర్ సర్టిఫికెట్ జారీచేస్తూ అదేతంతు కొనసాగుతుందని ఆ అధికారులపై పలువిధాలుగా విమర్శిస్తున్నారన్నారు. కిందిస్థాయి ఉద్యోగి తప్పులు చేశాడని తెలిసినా తప్పును కప్పిపుచ్చడానికి మండల ఉన్నతధికారుల నుండి జిల్లాస్థాయి అధికారుల వరకు చర్యలు తీసుకోక పోవడంతో అందులో వారి ప్రమేయం కూడా వున్నట్లుగా ప్రజలు మాట్లాడుకుంటున్నట్లుగా సమాచారం. కేవలం ఒక ఉద్యోగస్తుడిని కాపాడడానికి వారియొక్క సర్వశక్తులను ఒడ్డుతున్నారు. అదే విధంగా కొందరు గ్రామస్థాయి మండల నాయకుల నుండి జిల్లాస్థాయి అధికారులకు బిల్లు
బుక్కులు తారుమారు చేసిన విషయం తెలిసినా సదరు బిల్ కలెక్టర్ చేసిన బిల్లుల గోల్మాల్ వ్యవహారంను పలువార్తా పత్రికలు ప్రచురించినా పైఅధికారులు చూసీ చూడనట్లు ఉండటం వెనుకా ఆంతర్యం ఏమిటని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రికల ప్రచురించిన గోల్మాల్ ఉదాంతం కట్టిన ఇంటి పనలను పక్కా మళ్లించిన ఆధారాలతో పత్రికలలో వార్తలు ప్రచురితం అయినా పట్టనట్టు వ్యవహరించడంపట్ల అధికారులకే చెల్లిందని దీంట్లో వారి చేతివాటం కూడా ఉందేమో నని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మండల కో ఆప్షన్ సభ్యులు, స్థానిక ఎంపిటిసిలు, మాజీ వార్డ్ మెంబర్లు పైఅదికారులు బిల్లు బాగోతంపై చర్యలు తీసుకుంటారా లేక ఉదాసీనంగా వ్యవహరిస్తారా వేచి చూడాల్సిందే అంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోనట్లయితే జిల్లా అధికారుల దగ్గరికి నేరుగా కలిసి గ్రామపంచాయతీలో జరిగే అవినీతి అక్రమాలపై తెలియపరుస్తామని మండల నాయకులు కోపంతో దీనిపై ఎంత పెద్ద పైఅధికారుల హస్తమున్న తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదని ఆగ్రహించారు
.
