ప్రాంతీయం

వర్గల్ మండల బిజెపి అధ్యక్షులుగా టేకులపల్లి బాల్ రెడ్డి నియామకం 

110 Views

వర్గల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా టేకులపల్లి బాల్ రెడ్డిని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు నియామక పత్రాలు అందజేయగా, తనపై నమ్మకం ఉంచి మండల బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయానికి తన వంతు శ్రమించడంతో పాటు మండలంలో పార్టీ పటిష్టతకు కృషి చేయనున్నట్లు వివరించారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka