సిద్ధిపేట జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు దుద్దెడ తాజా మాజీ సర్పంచ్ ఆరేపల్లి మహదేవ్ గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ వీడి మంగళవారం హైదారాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




