ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు

85 Views

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ఒక నకిలీ ఖాతాను (ఫేక్ అకౌంట్) సృష్టించినట్లు మా దృష్టికి వచ్చింది.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు

సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ఒక నకిలీ ఖాతాను (ఫేక్ అకౌంట్) సృష్టించినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ నకిలీ ఖాతా ద్వారా ప్రజలకు సందేశాలు పంపే అవకాశం ఉందని భావిస్తున్నాము.ఈ సందర్భంగా ప్రజలకు మరియు సోషల్ మీడియా వినియోగదారులకు ఈ క్రింది సూచనలు జారీ చేయడమైనది:సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు. అందులో వచ్చే పోస్టులు లేదా సమాచారంతో పోలీస్ శాఖకు ఎలాంటి సంబంధం లేదు.ఆ ఖాతా నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు. అలాగే, ఆ ఖాతా నుండి ఎవరైనా మెసేజ్ చేసి డబ్బులు అడిగినా లేదా వ్యక్తిగత సమాచారం కోరినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.

.సైబర్ క్రైమ్ ఫిర్యాదు: ఈ నకిలీ ఖాతాపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగంలో రిపోర్ట్ చేయడం జరిగింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.ప్రజలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసపూరిత ఖాతాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాము. ఎవరైనా ఇటువంటి అనుమానాస్పద ఖాతాలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించగలరు అని కోరడమైనది.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *