Breaking News

మాజీ ఎమ్మెల్యే…

88 Views

ఏప్రిల్ 23, 24/7 తెలుగు న్యూస్ :పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.

కల్హేర్ మండలం మార్డి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని నిర్వహించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని గ్రామస్తులను కోరిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి .
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దమ్ముంటే నేను నిజాంపేట్ టు కల్హేర్ మరియు బీదర్ రోడ్లు తెచ్చా అని అబద్దాలతో పబ్బం గడుపుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజంగా తెచ్చినట్టు ఏదైనా రుజువు ఉంటే చూపించి ఓట్లు అడగాలని లేనిచో ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ చాలా మంచి వ్యక్తి అని తన సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని కాంగ్రెస్ వచ్చిన నుండి కరువు, కరెంట్ కష్టాలు వచ్చాయని ప్రతి నెల వచ్చే పెన్షన్ కూడా నెల నెల ఇవ్వట్లేరు అని, రైతుభందు కూడా అందరికీ ఇవ్వలేరు అని వారు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి అంటే వారికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి వారు చెప్పిన అబద్ధానికి గుణపాఠం చెప్పాలని తెలిపారు.
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఒక ప్రశ్నించే గొంతుకగా ప్రజల కోసం పనిచేస్తారని తెలియజేశారు. స్థానిక ప్రజలు కూడా తమ గోడు చెప్పుకుంటూ దేవుడిలాంటి కేసిఆర్ పాలన లేకపోవడం ఊహించలేక పోతున్నామని వాపోయారు
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, నాయకులు జనార్ధన్ సార్, నాగిరెడ్డి శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found