మెదక్ జిల్లా చేగుంట మండలం సోమవారం రోజు చందాయిపేట గ్రామంలో ముద్దచర్మ వ్యాధి(LSD)నివారణ టీకాలు కార్యక్రమం ను గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. ఈ టీకాలను ప్రతీ పశువుకు ఇవ్వాలని, ఈ టీకాలను వినియోగించుకోవాలని సర్పంచ్ చూచించారు. వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాధి గోమార్లు, ఈగలు, దోమలు, కేటకాలు ద్వారా వ్యాపిస్తుందని, శరీరం పై బొబ్బలు ఏర్పడుతాయని, కొట్టాలని శుభ్రం చేసుకుని,కీటకాలు రాకుండా పొగ పెట్టాలని రైతులు కు అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ, గోపాలమిత్ర ప్రశాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
